గ్రేటర్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నఎస్‌ఈసీ పార్థసారధి.. ఓటర్లకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటన..

| Edited By: Ram Naramaneni

Dec 01, 2020 | 6:11 AM

జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎస్ఈసీ పార్థసారధి తెలిపారు. రేపు సాయంత్రం వరకు మద్యం అమ్మకాలు నిలిపివేశామన్నారు.

గ్రేటర్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నఎస్‌ఈసీ పార్థసారధి.. ఓటర్లకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటన..
Follow us on

Greater Elections: జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎస్ఈసీ పార్థసారధి తెలిపారు. రేపు సాయంత్రం వరకు మద్యం అమ్మకాలు నిలిపివేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వికలాంగుల కోసం అన్ని పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు తరలించామని తెలిపారు. పొలిటికల్ లీడర్లు అవాంఛనీయ ఘటనలక పాల్పడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 38 లక్షల 89 వేల 600 మంది పురుషులు, 35 లక్షల 76 వేల 941 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 678 మంది ఉన్నారు. 150 డివిజన్లకు 9 వేల 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 22 వేల 272 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజ్ చేశామని ప్రకటించారు.