తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి వేగంగా దిగుతోన్న స్కార్పియో కారు బోల్తా కొట్టి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన భక్తులకు గాయాలయ్యాయి. కారులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తుండగా అదృష్టవశాత్తూ తండ్రీ కొడుకులు క్షేమంగా బయటపడ్డారు. మహిళకు చిన్నపాటి గాయాలు కావడంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.