కర్నాటకలో 21 నుంచి పాఠశాలలు ప్రారంభం

కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెస్టెంబర్ 21 నుంచి పాఠశాలలు, ప్రీ- యూనివర్సిటీ కాలేజీలు ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. తాజాగా కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు...

కర్నాటకలో 21 నుంచి పాఠశాలలు ప్రారంభం

Updated on: Sep 18, 2020 | 7:54 PM

కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెస్టెంబర్ 21 నుంచి పాఠశాలలు, ప్రీ- యూనివర్సిటీ కాలేజీలు ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. తాజాగా కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యయనాలకు సంబంధించి విద్యార్థులు సందేహాలను తెలుసుకోవచ్చన్నారు. ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు.

రెగ్యులర్ క్లాసులను తిరిగి ప్రారంభించాలనే ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యులర్ క్లాసులు ఉండవని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్య మంత్రి సురేష్ కుమార్ అన్నారు. సాధారణ తరగతులను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us