కరోనా అదుపులోకి వచ్చాకే స్కూళ్ళు..: కేంద్ర మంత్రి

| Edited By:

May 15, 2020 | 6:09 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో కరోనా అదుపులోకి వచ్చిన తర్వాతే స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని

కరోనా అదుపులోకి వచ్చాకే స్కూళ్ళు..: కేంద్ర మంత్రి
Follow us on

Ramesh Pokhriyal : కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ఈ క్రమంలో కరోనా అదుపులోకి వచ్చిన తర్వాతే స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. లాక్ డౌన్ అనంతరం పాఠశాలలు ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీచర్లకు పలు సూచనలు చేశారు. 30 శాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా స్కూళ్లను ప్రారంభించాలని సూచించారు.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

ఇటీవలే ‘పేరెంట్ సర్కిల్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పాఠశాలలు ప్రారంభించిన తరువాత, దాదాపు నెల రోజుల వరకు తమ పిల్లలను స్కూలు పంపమని చాలామంది తల్లిదండ్రులు తెలిపారు.

Also Read: తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపా.. పొడిగింపా..!