ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ తరగతులకు నో ఎగ్జామ్స్.!

|

Aug 08, 2020 | 6:06 PM

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు, కాలేజీలు రీ-ఓపెన్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుడ్ న్యూస్ అందించారు.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ తరగతులకు నో ఎగ్జామ్స్.!
Follow us on

School Syllabus Change And No Exams Upto 8th Class In AP: ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు, కాలేజీలు రీ-ఓపెన్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుడ్ న్యూస్ అందించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది పరీక్షలు ఉండవని.. ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా ప్రమోట్ చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు.

అటు విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు సిలబస్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. సుమారు 30 నుంచి 40 శాతం వరకు సిలబస్‌ను తగ్గించే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిపై యంత్రాంగం కసరత్తు చేస్తోందన్నారు. అటు 15 రోజులకు ఒకసారి స్కూళ్లలో పిల్లలకు హెల్త్ చెకప్ నిర్వహిస్తామని.. యాజమాన్యం వారి హెల్త్ రికార్డులను మెయింటైన్ చేయాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ఇక ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలలో ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై ప్రభుత్వం ఓ పద్దతిని సూచిస్తుందని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

Also Read: ఏపీ వచ్చే విదేశీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. క్వారంటైన్ నుంచి మినహాయింపు!