బకాయిలు చెల్లించకపోతే చర్యలే .. ఎస్‌బీఐ హెచ్చరిక

| Edited By:

Jun 28, 2019 | 8:03 PM

బకాయి ఎగవేతదారులపై బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కొరడా ఝుళిపించనుంది. దేశవ్యాప్తంగా 10 మంది ఉద్దేశ్యపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని బ్యాంకు గుర్తించింది. వీరికి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో చర్యలు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారీ ఎత్తున బకాయిలు చెల్లించాల్సిన ఎగవేతదారుల లిస్ట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసింది. వెంటనే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారతీయ స్టేట్ బ్యాంకుకు […]

బకాయిలు చెల్లించకపోతే చర్యలే ..  ఎస్‌బీఐ హెచ్చరిక
Follow us on

బకాయి ఎగవేతదారులపై బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కొరడా ఝుళిపించనుంది. దేశవ్యాప్తంగా 10 మంది ఉద్దేశ్యపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని బ్యాంకు గుర్తించింది. వీరికి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో చర్యలు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారీ ఎత్తున బకాయిలు చెల్లించాల్సిన ఎగవేతదారుల లిస్ట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసింది. వెంటనే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

భారతీయ స్టేట్ బ్యాంకుకు బకాయిపడ్డ వారిలో ముంబైకి చెందిన ఫార్మా, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, పవర్ సంస్ధలతోపాటు వీటికి చెందిన అధికారులు కూడా ఉన్నారు. వీరు దాదాపు రూ.1,500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి వుందని పేర్కొంది. రాబోయే 15 రోజుల్లో వడ్డీ, ఇతర ఛార్జీలతో సహా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. చెప్పిన సమయానికి బకాయిలు చెల్లించలేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎస్‌బీఐ. మొండి బకాయిలను వసూలు చేయకపోతే రానున్నరోజుల్లో ఆ భారం బ్యాంకుపై పడే అవకాశాలున్నందున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.