
సారా అలీఖాన్.. బాలీవుడ్ యువ హీరోయిన్.. సైఫ్ అలీ ఖాన్ గారాల ముద్దుల తనయ.. యువ నటీమణుల్లో ఒకరు. రెండు, మూడు సినిమాలే చేసినా అందం, అభినయంతో లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తన నటనతో ఎంతోమంది మనసు దోచుకున్నారు. సోషల్ మీడియాలో పలు యాక్టవిటీస్ తో ఎప్పటిపుడు అభిమానులతో టచ్ లో ఉండే ఈ చిన్నది.. గ్లామర్‌లో తాను ఎవరికేమీ తక్కువ కానంటోంది. గత కొద్ది రోజులుగా ఇదే ఇంట్లో ఉంటున్న సారా.. తన ఫ్యాన్స్‌కు మాత్రం పండుగ చేస్తోంది. నిత్యం ఇదే స్విమ్మిగ్ పూల్ వద్దే ఫోటోలకు ఫోజిలిస్తోంది. అవే ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది. తన ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ లో సారా సరదా సమయాన్ని గడిపిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా సారా అలీఖాన్ రెడ్ స్విమ్ షూట్ లో స్విమ్మింగ్ పూల్‌లో మెరిసిపోయింది. తన అందంలాను ఒలకబోస్తోంది. పూల్ మధ్యలో బెలూన్ పై కూర్చొని.. తనకిష్టమైన పుస్తకాన్ని చదువుతోంది. ఈ ఫోటోతోపాటు మరోఫోటును ఆ తర్వాత పోస్ట్ చేసింది సారా. ఈ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.