తెలుగు ప్రేక్షకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితులు లేవంటూ వ్యాఖ్య.

తాజాగా సామ్ జామ్ టాక్ షోలో భాగంగా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ, ప్రేక్షకుల అభిరుచులపై కొన్ని కామెంట్లు చేసింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకుల అభిరుచుల గురించి సామ్ మాట్లాడుతూ..

తెలుగు ప్రేక్షకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితులు లేవంటూ వ్యాఖ్య.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 19, 2020 | 8:38 PM

samantha shocking comments on tollywood: ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది అందాల తార సమంత. అనంతరం టాలీవుడ్‌లో దాదాపు అందరూ అగ్రహీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది అక్కినేని నట వారసుడు నాగచైతన్యను వివాహం చేసుకొని తెలుగింటి కోడలుగా మారింది. పెళ్లి తర్వాత ఇక సమంత సినిమాల్లో నటించదనుకుంటున్న సమయంలో వరుస ఆఫర్లతో దూసుకెళుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందీ చిన్నది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు.. ఓటీటీలలోనూ అదరగొడుతోంది. ఈ క్రమంలో సామ్ ‘ఆహా’ ఓటీటీ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ టాక్ షోలో భాగంగా సామ్ టాలీవుడ్ ఇండస్ట్రీ, ప్రేక్షకుల అభిరుచులపై కొన్ని కామెంట్లు చేసింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకుల అభిరుచుల గురించి సామ్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు ఎలాంటి పాత్రల్లో న‌టించినా ప్రేక్షకులు చూస్తారు. కానీ టాలీవుడ్‌లో ఆ ప‌రిస్థితి లేదు. బాలీవుడ్‌లో కేవ‌లం ఒక్క జోన‌ర్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే స్వేచ్ఛ ఉంది. అక్కడ ప్రేక్షకులంద‌రినీ సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేదు. అదే ద‌క్షిణాది ప్రేక్షకుల్లో విభిన్న ఆలోచ‌నలు, అభిరుచులు కనిపిస్తాయి. ప్రతి ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని సినిమాల‌ను తెర‌కెక్కించాల్సిన ప‌రిస్థితి ఇక్కడ ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది సమంత.