బిహార్‌లో ఆ తారల చిత్రాలను ఆడనివ్వరంట..!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం సినీ జగతిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ సోంత రాష్ట్ర ప్రజలు బాలీవుడ్ అగ్ర తారలపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆ తారల చిత్రాలను తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమంటున్నారు అభిమానులు.

బిహార్‌లో ఆ తారల చిత్రాలను ఆడనివ్వరంట..!

Updated on: Jun 25, 2020 | 3:49 PM

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం సినీ జగతిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ సోంత రాష్ట్ర ప్రజలు బాలీవుడ్ అగ్ర తారలపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆ తారల చిత్రాలను తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమంటున్నారు అభిమానులు. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ బలవన్మరణంతో ఇండస్ట్రీలోని బంధుప్రీతి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సీనిరంగంలోకి అడుగుపెట్టిన కారణంగానే బీటౌన్‌లోని చాలామంది అగ్రశ్రేణి తారలు సుశాంత్‌ను చులకనగా చూశారని సినీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో బీటౌన్‌లోని బంధుప్రీతిపై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మరణం అగ్రతారల హత్యగా చూడాలని ఆరోపణలు చేస్తున్నారు. అటు సుశాంత్‌ సొంత రాష్ట్రం బిహార్‌లో ఇకపై సల్మాన్‌, ఆలియా భట్‌, కరణ్‌ జోహార్‌ కుటుంబాలకు సంబంధించిన చిత్రాలను నిషేధించాలని అక్కడి అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ ఇద్దరు నటీనటుల చిత్రాలతోపాటు నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలను బిహార్‌లో ప్రదర్శించకుండా ప్రభుత్వం చొరవ జూపాలంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితి వారి సినిమాలను ఆడనివ్వబోమంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us