ఢిల్లీలో సెయిల్‌ ఛైర్మన్‌పై దాడి!

ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరి నిన్న రాత్రి ఆఫీస్‌ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆయన కారును మరో కారు ఢీకొట్టింది. అనిల్‌, ఆయన డ్రైవర్‌ కిందకు దిగి ప్రశ్నించారు. దీంతో కారులో ఉన్న నలుగురు యువకులు ఆగ్రహంతో వీరిపై దాడి చేశారు. ఓ వ్యక్తి డ్రైవర్‌ను పట్టుకోగా.. మిగతా ముగ్గురు అనిల్‌ తల, మెడ, కాళ్లపై ఐరన్‌ రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అటుగా వెళ్తున్న పెట్రోలింగ్‌ […]

ఢిల్లీలో సెయిల్‌ ఛైర్మన్‌పై దాడి!

Edited By:

Updated on: Aug 08, 2019 | 6:17 PM

ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరి నిన్న రాత్రి ఆఫీస్‌ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆయన కారును మరో కారు ఢీకొట్టింది. అనిల్‌, ఆయన డ్రైవర్‌ కిందకు దిగి ప్రశ్నించారు. దీంతో కారులో ఉన్న నలుగురు యువకులు ఆగ్రహంతో వీరిపై దాడి చేశారు. ఓ వ్యక్తి డ్రైవర్‌ను పట్టుకోగా.. మిగతా ముగ్గురు అనిల్‌ తల, మెడ, కాళ్లపై ఐరన్‌ రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అటుగా వెళ్తున్న పెట్రోలింగ్‌ పోలీసులు దాడిని చూసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనిల్‌ను రక్షించి సదరు యువకులను అరెస్టు చేశారు. దాడిలో గాయపడిన సెయిల్‌ ఛైర్మన్‌ను ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.దక్షిణ దిల్లీలోని హౌజ్‌ ఖాస్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సెయిల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలనే ఛైర్మన్‌పై దాడి చేసి ఉంటారని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.