‘దేశానికి వెన్నెముకలు ఐఏఎస్ అధికారులు.’. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు

ఐఏఎస్అధికారులు దేశానికి వెన్నెముకలని అభివర్ణించారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు. జగ్గీ వాసుదేవ్. పాలనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి, పాలకులకు, ప్రభుత్వానికి..

దేశానికి వెన్నెముకలు ఐఏఎస్ అధికారులు.. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు

Edited By:

Updated on: Jun 01, 2020 | 4:25 PM

ఐఏఎస్అధికారులు దేశానికి వెన్నెముకలని అభివర్ణించారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు. జగ్గీ వాసుదేవ్. పాలనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి, పాలకులకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసాన్ని పాదుకొల్పడానికి వారు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సంఘం సభ్యులతో 90 నిముషాల పాటు జరిగిన ఇంటరాక్షన్ లో ఆయన సుదీర్ఘంగా అనేక అంశాలపై మాట్లాడారు. ఈ ఆఫీసర్లు దేశానికి వెన్నెముకలు.. 25 నుంచి 30 ఏళ్ళ వరకు కెరీర్ గల ఈ అధికారులు సంకుచిత రాజకీయ నాయకుల కన్నా మెరుగైనవారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్లిష్ట సమయంలోకొత్త తరం ఐఏఎస్ అధికారులకు వీరు స్ఫూర్తినివ్వడం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఎందువల్లనంటే రాబోయే ఐదేళ్లలో మనం ఏం చేస్తామన్న విషయాన్ని రానున్న శతాబ్దం నిర్ణయించవచ్ఛు.. అని పరోక్షంగా నేటి రాజకీయ వ్యవస్థగురించి ప్రస్తావించారు.

‘ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్ విత్ సద్గురు’ అనే ఆన్ లైన్ సెషన్ లో భాగంగా సద్గురు ఇలా వారితో ఇంటరాక్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన డా.సంజయ్ చోప్రా,(1985 బ్యాచ్) సద్గురును అందరికీ పరిచయం చేశారు. ఈ సంస్థ ఎంతోకాలంగా పౌర సేవా సంస్థల్లో ఒకటని ఆయన చెప్పారు (ఈయన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కూడా).  దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సెషన్ లో పాల్గొన్నారు.

అడ్మినిస్ట్రేషన్ లో పర్సనల్, సిస్టమాటిక్ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎలా అన్న అంశాలతో సహా వివిధ విషయాలపై ఈ అధికారులు సద్గురును ప్రశ్నలు అడిగి తమ సందేహాలను  తీర్చుకున్నారు. వీరిలో రాజేష్ లఖోనీ (తమిళనాడు 1992 బ్యాచ్), అమిత్ కుమార్ ఘోష్ (యూపీ 1994 బ్యాచ్), శ్రీమతి విజయలక్ష్మి బిదారీ (మహారాష్ట్ర 2001),ప్రొఫెసర్ యు.ఆర్.రావు (ఇస్రో), డా.మిలింద్ రామ్ టేకే (త్రిపుర 2009), కౌశల్ రాజ్ శర్మ (యూపీ 2006 బ్యాచ్) ఉన్నారు.

యోగా అంటే ఏమిటన్న ప్రశ్నకు సద్గురు.. యోగా అనే పదానికి యూనియన్ అని అర్థమని, మీరు వ్యక్తిగత స్వభావాన్ని సీరియస్  గా తీసుకోకుంటే సహజంగానే యోగాలో ఉంటారని చెప్పారు. మీరు ప్రకృతిలో మమేకమైనప్పుడే ‘యూనియన్’ సాధ్యమవుతుందని, పైగా ఉత్తమమైన ఆలోచనలు మన నుంచి బయటికి వస్తాయని ఆయన వివరించారు.

నిర్ణయాలను తీసుకోవడంలో ఒక్కోసారి డైలమాలో పడతామని, అప్పుడు ఎలా వ్యవహరించాలని, సందిగ్ధ, సంక్లిష్ట చట్టాలు ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో ఏ విధంగా ప్రవర్తించాలని రాజేష్ లఖోనీ, జె.ఎం.బాలమురుగన్ ప్రశ్నించారు.అయితే మానవతా దృక్పథంతో బాటు సంక్లిష్ట చట్టాలున్నప్పుడు మన బుధ్ది బలంతో, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని, ఇందుకు వెనుకాడరాదని సద్గురు పేర్కొన్నారు. కుల వ్యవస్థ ప్రస్తావన వచ్చినప్పుడు.. ఫ్యూడలిజానికి బేసిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఈ వ్యవస్థేనని, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తమకు సామాజిక భద్రత ఉంటుందనే ప్రజలు అందులో భాగమయ్యారని సద్గురు వివరించారు. దేశ విశ్వజనీన సామాజిక భద్రతను సంస్థాగతం చేయలేకపోతే సమీప భవిష్యత్తులో కుల వ్యవస్థ అంతరించిపోయే అవకాశం లేదని ఆయన చెప్పారు.

‘సివిల్ అడ్మినిస్ట్రేటర్ గా మీరు చట్టం ప్రకారం నడుచుకోవాలి.. మీరు మానవతావాదులే అయినప్పటికీ.. చట్ట పరిధి అన్నది ఒకటుంటుంది.. దాన్ని విస్మరించరాదు. చట్ట పరిధిలోనే మానవతను చూపాల్సిఉంటుంది.. మనం చట్టాన్ని బలహీనపరిస్తే మనకు ఓ వ్యవస్థ అంటూ ఉండదు’.. అన్నారు సద్గురు. సంక్లిష్టమైన, నిరంకుశమైన చట్టాలను రద్దు చేయాలని ఆయన సూచించారు. బ్రిటిష్ వారు తమకు అనుకూలమైన, అనుగుణమైన చట్టాలను రూపొందించారని, ప్రజల కోసం కాక.. వారిని (ప్రజలను) కంట్రోల్ చేయడానికే ఆ చట్టాలు చేశారని అన్నారు.’ దేశంలో ఎన్నో ఏళ్లుగా క్రూర ఆక్రమణలు జరిగాయి. ఈ దేశానికి సుమారు 250 సంవత్సరాల వృత్తిగత చరిత్ర ఉన్నప్పటికీ ఈ దేశం తన పురాతన, ఉత్కృష్టమైన వారసత్వాన్ని కొనసాగిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మానవ చైతన్యాన్ని పెంచడం ఎంత ముఖ్యమని అమిత్ కుమార్ ఘోష్ ప్రశ్నించగా… ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ చైతన్యానికి వెలకట్టలేమని, మానవాళి ఉన్నంతవరకూ ఈ చైతన్యమే వారిని నడిపిస్తుందని అన్నారు. ఈ (కరోనా) ఎపిడమిక్ సమయంలో అధికారులంతా స్థానికంగా, ప్రాంతీయంగా, జాతీయ స్థాయిలో కూడా సేవలు చేసినందుకు వారికి సద్గురు ఆశీస్సులు అందజేశారు. ఈ సవాళ్ల సమయంలో మీరంతా విజయవంతంగా దీనినెదుర్కొంటున్నారని ప్రశంసించారు. కాగా-ఈ సిరీస్ గత మే 30 న ప్రత్యక్ష ప్రసారమైంది.