శబరిమల దర్శనం : మాస్కుల ధారణపై వీడని సందిగ్ధత

సరిగ్గా 7 నెలల బ్రేక్‌ తరువాత శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం కలిగింది. ఈ నెల 16 నుంచి మాసపూజల నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి....

శబరిమల దర్శనం : మాస్కుల ధారణపై వీడని సందిగ్ధత

Updated on: Oct 11, 2020 | 8:47 PM

సరిగ్గా 7 నెలల బ్రేక్‌ తరువాత శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం కలిగింది. ఈ నెల 16 నుంచి మాసపూజల నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతినిస్తామని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు-టీడీబీ ప్రకటించింది.

దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా 48 గంటల ముందు కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలి. నెగటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి దర్శనానికి అనుమతిస్తారు. నెగటివ్‌ సర్టిఫికెట్‌ లేకుండా వచ్చే భక్తులకు పంపా బేస్‌ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలు వచ్చే వరకు భక్తులు వేచి ఉండాల్సిందే. ఆలయంలో నిత్యపూజలు యథావిధిగా కొనసాగినా.. ఏడు నెలలుగా భక్తులను అనుమతించలేదు.

పంపా బేస్‌ వద్ద ఉన్న కన్నెమూల గణపతి ఆలయం నుంచి 5 కిలోమీటర్లు కొండపైకి నడిచి వెళ్లేప్పుడు.. మాస్కుల ధారణ అవసరమా? లేదా? అనేదానిపై టీడీబీ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ట్రెకింగ్‌ సమయంలో మాస్కులు ధరిస్తే శ్వాస సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై టీడీబీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.