సుష్మాస్వరాజ్ తరహాలోనే సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. ట్విట్టర్ ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. జయశంకర్‌కు మార్క్ చేసి ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. కువైట్‌లో ఉంటున్న తన భర్త ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కువైట్‌లో రాయబార కార్యాలయం ఇప్పటికే ఈ పనిలో ఉందంటూ బదులిచ్చారు. మహాలక్ష్మి అనే మహిళకు భరోసా ఇచ్చారు జయశంకర్. జర్మనీ, ఇటలీ టూర్‌కు వెళ్లిన తమ బ్యాగ్‌ను దొంగలు పట్టుకుపోయారని మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. రోమ్ కార్యాలయంలో సంప్రదించమని సూచించారు మంత్రి.
My first tweet.
Thank you all for the best wishes!
Honoured to be given this responsibility.
Proud to follow on the footsteps of @SushmaSwaraj ji— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 1, 2019
Our Embassy in Kuwait is already working on it. Please be in touch with them @indembkwt https://t.co/w9BRPXTTZr
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019
Our Embassy in Rome/ Consul General in Munich will extend all assistance. Please be in touch with them @IndiainItaly @cgmunich https://t.co/JDGEfdZ5pP
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 2, 2019