మాస్కోలో నిరసనలు.. ఫిన్లాండ్ లో విహారాలు..

|

Jul 28, 2019 | 6:02 PM

మాస్కోలో ఓ వైపు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే.. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్,, హాయిగా తనకేమీ పట్టనట్టు ఫిన్లాండ్ గల్ఫ్ లో సముద్ర తీరాన గడుపుతున్నారు. రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో సముద్రంలో మునిగిపోయిన సోవియట్ సబ్-మెరైన్ ను చూసేందుకు మరో జలాంతర్గామిలో ప్రయాణమయ్యారు. ఈ ‘ విజిట్ ‘ తాలూకు వీడియో బయటికి రాగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 1942 అక్టోబరులో సోవియట్ జలాంతర్గామి జర్మన్ నౌకల ధాటికి […]

మాస్కోలో నిరసనలు.. ఫిన్లాండ్ లో విహారాలు..
Follow us on

మాస్కోలో ఓ వైపు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే.. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్,, హాయిగా తనకేమీ పట్టనట్టు ఫిన్లాండ్ గల్ఫ్ లో సముద్ర తీరాన గడుపుతున్నారు. రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో సముద్రంలో మునిగిపోయిన సోవియట్ సబ్-మెరైన్ ను చూసేందుకు మరో జలాంతర్గామిలో ప్రయాణమయ్యారు. ఈ ‘ విజిట్ ‘ తాలూకు వీడియో బయటికి రాగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 1942 అక్టోబరులో సోవియట్ జలాంతర్గామి జర్మన్ నౌకల ధాటికి సముద్రంలో మునిగిపోయింది. నాటి ఘటనలో అందులోని 40 మంది మృతి చెందారు. ఈ సబ్-మెరైన్ ఇటీవల సముద్రంలో నుంచి కొంతవరకు బయటపడగా దాన్ని చూసేందుకు పుతిన్ అక్కడికి పయనమయ్యాడు. అత్యంత భద్రత మధ్య ఆయన ఫిన్లాండ్ సందర్శించాడు.