బ్రేకింగ్, ఢిల్లీలో మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా ! రూ. 2 వేలు చెల్లించాల్సిందే !

| Edited By: Pardhasaradhi Peri

Nov 19, 2020 | 3:16 PM

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మాస్కులు ధరించకపోతే..

బ్రేకింగ్, ఢిల్లీలో మాస్కులు ధరించకపోతే భారీ జరిమానా ! రూ. 2 వేలు చెల్లించాల్సిందే !
Follow us on

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మాస్కులు ధరించకపోతే రూ. 500 నుంచి 2 వేల రూపాయలవరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. నిన్న ఒక్కరోజే నగరంలో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 131 మంది కరోనా రోగులు మృతి చెందారు.

గురువారం నగరంలో కరోనా పరిస్థితి ఫై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్..మాస్కుల ధారణ తప్పనిసరి అన్నారు. ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాప్తిని నివారించాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని, చాలామంది మాస్కులు ధరించడం లేదని ఆయన అన్నారు. కరోనా కారణంగా ఈ సారి ఛత్ పూజా కార్యక్రమాన్ని ఇళ్లలోనే నిర్వహించుకోవాలన్నారు. ఈ పూజవల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందనే భారీ జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నాం అని  కేజ్రీవాల్ వివరించారు. ధార్మిక సంస్థలు, స్వఛ్చంద సంస్థలు కూడా ఈ వైరస్ వ్యాప్తి నివారణలో చొరవ తీసుకోవాలి, నగర వ్యాప్తంగా మార్కెట్లలో మాస్కులు పంచాలని కోరుతున్నాం అని ఆయన తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ కోరుతున్నాం అని పేర్కొన్నారు.