చాహల్​ ఫన్నీ డ్యాన్స్​ వీడియో, సోషల్ మీడియాలో వైరల్

|

Sep 16, 2020 | 4:48 PM

భారత క్రికెటర్  ​​యుజ్వేంద్ర చాహల్  ఫన్నీ చేష్టలతో సోషల్ మీడియలో నెటిజన్లను అలరిస్తుంటాడు. ఈ ఐపీఎల్ లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే.

చాహల్​ ఫన్నీ డ్యాన్స్​ వీడియో, సోషల్ మీడియాలో వైరల్
Follow us on

భారత క్రికెటర్  ​​యుజ్వేంద్ర చాహల్  ఫన్నీ చేష్టలతో సోషల్ మీడియలో నెటిజన్లను అలరిస్తుంటాడు. ఈ ఐపీఎల్ లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ వేదికగా నవ్వులు పూయించడం ప్రారంభించాడు ఈ స్పిన్నర్. తన జట్టులోని సహచర ఆటగాడు క్రిస్​ మోరిస్​తో కలిసి ఫన్నీ డ్యాన్స్​ వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్​ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇటీవల తన ప్రియురాలు,​ కొరియోగ్రాఫర్​ ధనశ్రీ వర్మతో ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు చాహల్​. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్​ కోసం కఠోర సాధన చేస్తున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. ఈ జట్టు తన ఫస్ట్ మ్యాచ్​లో సెప్టెంబరు 21న సన్​రైజర్స్ హైదరాబాద్​తో తలపడనుంది.

 

Also Read :

ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!

బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?