ప్రముఖ వ్యాపార వేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినీతి కేసులో ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. గురువారం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఢిల్లీలోని NCR, రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు బినామీ ఆస్తులున్నాయనే ఆరోపణలున్నాయి. లండన్‌లో రూ.16 కోట్ల విలువైన ఆస్తుల్ని రాబర్ట్ వాద్రా కొన్నట్లు, ఈ విషయంలో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు వాద్రాపై కేసు నమోదైంది. అయితే ఇటీవలే రాబర్ట్ వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అయితే ఆయనకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాద్రా స్పందించాలని సోమవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జులై 17లోగా ఈడీ పిటిషన్‌పై స్పందించాలని వాద్రాకు నోటీసులు కూడా జారీ చేసింది.