Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం

కడప జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఓబులవారిపల్లి మండల పరిధిలోని చిన్న ఓరంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం

Edited By:

Updated on: Mar 06, 2020 | 4:05 PM

Road Accident: కడప జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఓబులవారిపల్లి మండల పరిధిలోని చిన్న ఓరంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలం చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య (42), తల్లి సుబ్బమ్మ (60), కుమారుడు హరిచరణ్‌ (8) కువైట్‌ నుంచి చెన్నైకి వచ్చారు.

కాగా.. అక్కడి నుంచి స్వగ్రామమైన పుల్లంపేటకు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో ఓరంపాడు ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారును కడప నుంచి తిరుపతికి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది. సంఘటనా స్థలానికి మృతుల బంధువులు చేరుకుని గుండెలవిసేలా విలపించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.