Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి..!

|

Feb 20, 2020 | 9:06 AM

తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిర్పూరు జిల్లా అవినాశి వద్ద..ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారి ఢీకొంది

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి..!
Follow us on

Road Accident:  తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిర్పూరు జిల్లా అవినాశి వద్ద..ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారి ఢీకొంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. 48 మంది ప్రయాణికులతో కేరళ ప్రభుత్వం నడుపుతున్న బస్సు తిర్పూరు నుంచి తిరువనంతపురం వెళుతోంది. చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వేగంతో  ప్రయాణిస్తోన్న సమయంలో కంటైనర్ టైర్ పేలి అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు స్పాట్‌కి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కోయంబత్తూర్ నుంచి వస్తున్న కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు చిధ్రమైన విధానాన్ని చూస్తే ప్రమాద తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ప్రమాదం జరిగిన రెండు గంటల వరకు బస్సులో నుంచి ఒక్క ప్రమాణికుడు కూడా బయటకు రావడానికి వీలుపడలేదు. క్రేన్లు, గ్యాస్ కట్టర్స్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.