సుశాంత్ కేసు, రియా చక్రవర్తి ఫోన్ కాల్స్ డిటెయిల్స్ తెలిశాయి

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 5:33 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కాల్ డీటైల్స్ ని ఈడీ సేకరించింది. ఏడాది కాలంలో ఆమె సుశాంత్ తో సుమారు 250 సార్లు ఫోన్ లో మాట్లాడిందని..

సుశాంత్ కేసు, రియా చక్రవర్తి ఫోన్ కాల్స్  డిటెయిల్స్ తెలిశాయి
Follow us on

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కాల్ డీటైల్స్ ని ఈడీ సేకరించింది. ఏడాది కాలంలో ఆమె సుశాంత్ తో సుమారు 250 సార్లు ఫోన్ లో మాట్లాడిందని, తన తండ్రితో 1192 సార్లు, సోదరుడు షోవిక్ తో 1069 సార్లు మాట్లాడినట్టు ఆమె కాల్ డిటెయిల్స్ ద్వారా తెలిసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ తో జనవరి 16 న ఏడు సార్లు, మొత్తం ఏడాది కాలంలో 16 సార్లు మాట్లాడినట్టు వెల్లడైంది. రియా చండీగఢ్ లో ఉండగా భట్ తో ఎక్కువసార్లు టచ్ లో ఉందట.. అలాగే సుశాంత్ సైకియాట్రిస్ట్ అయిన కెర్సీ చావ్దాతో కూడా చాలాసార్లు రియా మాట్లాడిందని ఈడీ అధికారులు తెలిపారు.