ఏపీలో ఏం జరుగుతోంది..? మళ్లీ తెరపైకి రీపోలింగ్‌..!

| Edited By:

May 16, 2019 | 12:36 PM

కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో తీవ్ర వివాదం రేపుతోంది.. ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశించడం ఏంటన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఫిర్యాదుపై విచారణ చేసిన ఈసీ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని […]

ఏపీలో ఏం జరుగుతోంది..? మళ్లీ తెరపైకి రీపోలింగ్‌..!
Follow us on

కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో తీవ్ర వివాదం రేపుతోంది.. ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశించడం ఏంటన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది.

కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఫిర్యాదుపై విచారణ చేసిన ఈసీ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న రీపోలింగ్ జరుగుతుంది. అయితే.. రీపోలింగ్‌కు ఆదేశించడంపై వైసీపీ స్వాగతించింది. ఈసీ సరైన నిర్ణయం తీసుకుందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. టీడీపీ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రీపోలింగ్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ సబ్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది.