జిన్‌పింగ్‌ను విమర్శించి కటకటాల పాలయ్యాడు

|

Sep 23, 2020 | 12:07 PM

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఎవరైనా పల్లెత్తు మాట అనగలరా? మాటవరసకైనా ఓ మాటనేసి మనుగడ సాగించగలరా? జిన్‌పింగ్‌ ఎలాంటి వ్యక్తో తెలిసీ ఓ పెద్దమనిషి ఘాటుగా విమర్శించారు.. ఒకప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునే రెన్‌ జికియాంగ్..

జిన్‌పింగ్‌ను విమర్శించి కటకటాల పాలయ్యాడు
Follow us on

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఎవరైనా పల్లెత్తు మాట అనగలరా? మాటవరసకైనా ఓ మాటనేసి మనుగడ సాగించగలరా? జిన్‌పింగ్‌ ఎలాంటి వ్యక్తో తెలిసీ ఓ పెద్దమనిషి ఘాటుగా విమర్శించారు.. ఒకప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునే రెన్‌ జికియాంగ్‌ ఉత్తినే ఉండగా జిన్‌పింగ్‌ను విమర్శిస్తూ గత మార్చిలో ఓ పెద్ద వ్యాసమే రాశారు.. రాసిన తర్వాత అబ్‌స్కాండింగ్‌ అయ్యారు.. జిన్‌పింగ్‌ను అంతలేసి మాటలంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? రెన్‌ జికియాంగ్‌ పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది.. అవినీతి, లంచం, ప్రజా నిధుల అపహరణకు పాల్పడ్డారంటూ తేల్చేసింది.. అంతే బీజింగ్‌లోని నెంబర్‌ టూ ఇంటర్మీడియట్‌ పీపుల్స్‌ కోర్టు అతడికి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.. అంతేకాకుండా ఇంచుమించు ఆరు లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. సుమారు 50 మిలియన్‌ యువాన్లు లంచాలను అతగాడు తీసుకున్నాడట! అలాగని జికియాంగ్‌ స్వచ్ఛందంగా అంగీకరించాడట! ఆయనే నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి పీపుల్స్‌ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయలేని నిస్సహాయ స్థితి.. జిన్‌పింగ్‌పై వ్యాసం ప్రచురించిన కొద్ది రోజులకు జికియాంగ్‌ను పార్టీ కూడా సస్పెండ్‌ చేసింది. విమర్శిస్తే జైల్లో తోస్తారా? ఇదేమీ అన్యాయం అంటూ గొంతెత్తుతున్నాయి హక్కుల సంఘాలు..