గుడ్ న్యూస్: కరోనా పేషెంట్లకు ‘వ్యాక్సీన్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

గుడ్ న్యూస్: కరోనా పేషెంట్లకు వ్యాక్సీన్.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు..

Updated on: Jun 03, 2020 | 6:06 PM

Remdesivir gets nod from CDCSO: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వ్యాధికి యాంటీ వైరల్ ఔషధం రెమిడీసివిర్ పని చేస్తున్నదని తేలడంతో, ఈ ఔషధం వాడేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఐదు డోసులను మాత్రమే రోగులకు అందించాలని నిబంధన విధించింది.

వివరాల్లోకెళితే.. జూన్ 1 నుంచి అత్యవసర పరిస్థితుల్లో రెమిడీసివిర్ ను వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేశాము. కేవలం ఐదు డోసులు మాత్ర‌మే ఇవ్వాలి.. అని డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. ఈ ఔషధాన్ని కరోనా వైరస్ సోకిన వారిపై ప్రయోగించగా, మెరుగైన ఫలితాలు కనిపించాయని, అందువల్లే దీన్ని అనుమతించామని కేంద్రం ప్రకటించింది.

కాగా, గత నెలలోనే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ అత్యవసర పరిస్థితుల్లో రెమిడీసివిర్ వాడకాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us