నవంబరు 30 బదులు, డిసెంబరు 31 వరకు, నెల రోజుల పొడిగింపు

| Edited By: Pardhasaradhi Peri

Oct 24, 2020 | 5:01 PM

2019-20 ఆర్ధిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్ రిటర్నులను దాఖలు చేసే గడువును ఆదాయపన్ను శాఖ నెలరోజులు పొడిగించింది. 2019 ఏప్రిల్-2020 మార్చి 31 మధ్య తాము గడించిన ఆదాయానికి సంబంధించి టాక్స్ రిటర్నుల దాఖలుకు వీరికి  నెల రోజుల వ్యవధిని ఇస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. నిజానికి ఈ గడువు నవంబరు 30 తో ముగుస్తుంది.  ఆయా వ్యక్తులు తమ అకౌంట్ల ఆడిట్ ని సమర్పించేందుకు కొత్త డెడ్ లైన్ […]

నవంబరు 30 బదులు, డిసెంబరు 31 వరకు, నెల రోజుల పొడిగింపు
Follow us on

2019-20 ఆర్ధిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్ రిటర్నులను దాఖలు చేసే గడువును ఆదాయపన్ను శాఖ నెలరోజులు పొడిగించింది. 2019 ఏప్రిల్-2020 మార్చి 31 మధ్య తాము గడించిన ఆదాయానికి సంబంధించి టాక్స్ రిటర్నుల దాఖలుకు వీరికి  నెల రోజుల వ్యవధిని ఇస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. నిజానికి ఈ గడువు నవంబరు 30 తో ముగుస్తుంది.  ఆయా వ్యక్తులు తమ అకౌంట్ల ఆడిట్ ని సమర్పించేందుకు కొత్త డెడ్ లైన్ ని డిసెంబరు 31 బదులు జనవరి 31 వరకు పొడిగించినట్టు ఈ సంస్థ వివరించింది. కోవిడ్ 19 ఔట్ బ్రేక్ కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము పరిగణనలోకి తీసుకున్నామని ఈ బోర్డు పేర్కొంది.

ఇక చిన్న, మధ్యస్థాయి టాక్స్ పేయర్స్ లేదా సెల్ఫ్ అసెస్ మెంట్ పై ఆధారపడి….. లక్ష రూపాయలవరకు టాక్స్ లయబిలిటీ గలవారికి ఇచ్చిన గడువును కూడా జనవరి 31 వరకు పొడిగించారు