జీయో బంపర్ ఆఫర్.. ఐదు నెలలపాటు ఫ్రీ డేటా

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెంన్స్ డే ఆఫర్‌లో భాగంగా జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు..

జీయో బంపర్ ఆఫర్.. ఐదు నెలలపాటు ఫ్రీ డేటా

Updated on: Aug 14, 2020 | 7:39 PM

Jio Offers 5 Months of Free Data : రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెంన్స్ డే ఆఫర్‌లో భాగంగా జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలలపాటు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందివ్వనున్నట్టు పేర్కొంది.  జియోఫై ధర రూ. 1,999 మాత్రమే. అయితే ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులు తొలుత జియోపై కోసం ఇప్పటికే ఉన్న ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాలి.

రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేసి జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అయిన గంట తర్వాత ప్లాన్ అమల్లోకి వస్తుంది. మై జియో యాప్ ద్వారా యాక్టివేషన్ స్టేటస్‌ తెలుస్తుంది.

అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో రూ.199 అత్యంత చవకైన ప్లాన్. మరో ప్లాన్.. రూ. 249తో అందుబాటులో ఉన్న రెండో ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇది రూ. 349తో అందుబాటులో ఉన్న మూడో ప్లాన్‌లో 28 రోజులపాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది.