కేరళలో రెడ్‌ అలర్ట్… భారీ వర్ష సూచన! 

| Edited By:

Jul 16, 2019 | 8:55 PM

భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ముందు జాగ్రత్తగా రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. గత ఏడాది వరద బీభత్సం.. ఎంతో మందిని బలితీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులంతా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం […]

కేరళలో రెడ్‌ అలర్ట్... భారీ వర్ష సూచన! 
Follow us on

భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ముందు జాగ్రత్తగా రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. గత ఏడాది వరద బీభత్సం.. ఎంతో మందిని బలితీసుకున్న విషయం విదితమే.

ఈ క్రమంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులంతా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అలాగే ఇడుక్కి, వయనాడ్‌, కానూర్‌, ఎర్నాకులం, త్రిసూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. కాగా వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కేరళను వరదలు ముంచెత్తాయి.