RCB vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం

|

Oct 31, 2020 | 11:27 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా శనివారం రాత్రి మరో కీలక మ్యాచ్ జరిగింది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.

RCB vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం
Follow us on

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా శనివారం రాత్రి మరో కీలక మ్యాచ్ జరిగింది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ దుమ్మురేపింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి బెంగళూరుపై అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్‌ బౌలర్లు సమష్ఠిగా సత్తా చాటడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 120 పరుగులకే పరిమితమైంది. ఫిలిప్‌ (32; 31 బంతుల్లో, 4×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.  అనంతరం బరిలోకి దిగిన హైదారాబాద్ జట్టులో వృద్ధిమాన్‌ సాహా( 39; 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో పాటు మనీష్‌ పాండే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హోల్డర్‌(26 నాటౌట్‌; 10 బంతుల్లో  1 ఫోర్‌, 3 సిక్స్‌లు) మంచిగా ఆడటంతో  సన్‌రైజర్స్‌ ఈజీగా విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లేఆఫ్‌ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది.

Also Read  :

తెలంగాణ : ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గ‌డువు పెంపు

Bheem For Ramaraju : యూట్యూబ్​లో సరికొత్త రికార్డు