ఆర్సీబీ కొత్త థీమ్ సాంగ్ వచ్చింది… అప్పుడే విమర్శలు కూడా..

ఫ్రాంఛైజీ కొత్త ఆంథెమ్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. అభిమా‌నుల్లో జోష్ నింపేందుకు ఆర్‌సీబీ థీమ్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఐతే సాంగ్‌లో హిందీ, ఇంగ్లీష్‌ లిరిక్స్‌ ఉండటంపై ఫ్యాన్స్‌ సోషల్‌మీడియా...

ఆర్సీబీ కొత్త థీమ్ సాంగ్ వచ్చింది... అప్పుడే విమర్శలు కూడా..

Updated on: Sep 18, 2020 | 5:40 PM

ఐపీఎల్ జోష్ మొదలు కాబోతోంది. అత్యంత వేగంగా ఆడేందుకు ఆటగాళ్లు రెడీ అవుతున్నారు.  నెట్ ప్రాక్టీస్‌లో తెగ బిజీగా మారిపోయారు. ఐపీఎల్ 2020ని గెలిచేది తామేనంటూ ప్రకటనలు చేస్తున్నారు.  దీంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.

రాబోయే ఐపీఎల్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఫ్రాంఛైజీ కొత్త ఆంథెమ్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. అభిమా‌నుల్లో జోష్ నింపేందుకు ఆర్‌సీబీ థీమ్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఐతే సాంగ్‌లో హిందీ, ఇంగ్లీష్‌ లిరిక్స్‌ ఉండటంపై ఫ్యాన్స్‌ సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ముఖ్యంగా కన్నడ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బెంగళూరు ఫ్రాంఛైజీ థీమ్‌ సాంగ్‌లో కన్నడ పదాలు లేవని భారత మాజీ పేసర్‌ దొడ్డ గణేశ్‌తో సహా చాలా మంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరహాలో బెంగళూరు కూడా స్థానిక భాషలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఓ నెటిజన్‌ కోరాడు. ఇంగ్లీష్‌, కన్నడను ఉపయోగించండి కానీ, హిందీ భాషను మాత్రం మాపై రుద్దే ప్రయత్నం చేయొద్దని మరొకరు విజ్ఞప్తి చేశారు. వీరి కోరికను జట్టు యాజమాన్యం ఎంతవరకు పరిశీలిస్తుందో చూడాలి.