ఇక ఆన్‌లైన్ నగదు లావాదేవీలు ఉచితం!

| Edited By:

Jun 12, 2019 | 7:24 AM

ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీలకు జులై 1 నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్‌), ఆర్‌టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీకి చార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులకు తెలిపింది. ఐదురోజుల క్రితమే ఆన్‌లైన్ సేవలకు ఛార్జీలు రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిపై తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించేందుకు నందన్‌ నీలేకని నేతృత్వంలోని కమిటీ […]

ఇక ఆన్‌లైన్ నగదు లావాదేవీలు ఉచితం!
Follow us on

ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీలకు జులై 1 నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఈఎఫ్‌టీ (నెఫ్ట్‌), ఆర్‌టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీకి చార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులకు తెలిపింది. ఐదురోజుల క్రితమే ఆన్‌లైన్ సేవలకు ఛార్జీలు రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిపై తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించేందుకు నందన్‌ నీలేకని నేతృత్వంలోని కమిటీ పలు సిఫారసులు చేసింది. ఛార్జీలను ఎత్తివేయడం, ఎల్లవేళలా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడటం లాంటి అంశాలను ఆ సిఫార్సుల్లో పొందుపరిచింది. దానికి సంబంధించిన నివేదికను గత నెలలో ఆర్బీఐకి నీలేకని కమిటీ అందజేసింది.