బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా వీకే జోహ్రి! 

దేశ అతిపెద్ద సరిహద్దు రక్షణ దళమైన బీఎస్‌ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) డైరెక్టర్‌ జనరల్‌ గా ఐపీఎస్‌ అధికారి వీకే జోహ్రి నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ(ఏసీసీ) ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జోహ్రి 1984 బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన ప్రస్తుతం ‘రా’కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత బీఎస్‌ఎఫ్‌ డీజీ రజనీకాంత్‌ మిశ్రా ఆగస్టు 31న పదవీవిరమణ పొందిన అనంతరం జోహ్రీ […]

బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా వీకే జోహ్రి! 

Edited By:

Updated on: Jul 29, 2019 | 1:03 AM

దేశ అతిపెద్ద సరిహద్దు రక్షణ దళమైన బీఎస్‌ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) డైరెక్టర్‌ జనరల్‌ గా ఐపీఎస్‌ అధికారి వీకే జోహ్రి నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ(ఏసీసీ) ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జోహ్రి 1984 బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన ప్రస్తుతం ‘రా’కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత బీఎస్‌ఎఫ్‌ డీజీ రజనీకాంత్‌ మిశ్రా ఆగస్టు 31న పదవీవిరమణ పొందిన అనంతరం జోహ్రీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా జోహ్రీని కేంద్ర హోం శాఖ ప్రత్యేక విధుల అధికారిగా (ఓఎస్డీ)గానూ నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.