మైనర్ బాలికపై లైంగికదాడి.. పారిపోతుండగా పోలీసుల కాల్పులు
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి పోలీసుల చెర నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. పోలీసులపై నిందితుడు దాడి చేయడంతో వారు ఎదురు కాల్పులు జరిపారు.
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి పోలీసుల చెర నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. పోలీసులపై నిందితుడు దాడి చేయడంతో వారు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో గాయపడ్డ నిందితుడిని తిరిగి అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. గ్రేటర్ నోయిడా నగరంలోని సుర్జాపూర్ ప్రాంతానికి చెందిన సోను ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడైన సోనుపై పోస్కో కింద కేసు నమోదు చేసి నోయిడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న సోను పోలీసులపై దాడికి దిగి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో సోను గాయపడ్డాడని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ అంకూర్ అగర్వాల్ చెప్పారు. కాల్పుల్లో గాయపడిన రేపిస్టును పోలీసులు ఆసుపత్రికి తరలించారు.