Rakul About Corona: రకుల్‌ కరోనాను ఎలా జయించిందో తెలుసా..? స్వానుభవం వివరించిన హీరోయిన్..

Rakul Says How She Recoverd From Covid: కరోనా మహమ్మారి మానవజీవితాల్లో ప్రవేశించి ఏడాది గడుస్తోన్నా భయపెట్టిస్తూనే ఉంది. ఇప్పటికీ...

Rakul About Corona: రకుల్‌ కరోనాను ఎలా జయించిందో తెలుసా..? స్వానుభవం వివరించిన హీరోయిన్..

Updated on: Jan 01, 2021 | 3:41 PM

Rakul Says How She Recoverd From Covid: కరోనా మహమ్మారి మానవజీవితాల్లో ప్రవేశించి ఏడాది గడుస్తోన్నా భయపెట్టిస్తూనే ఉంది. ఇప్పటికీ ఓ నిర్ధిష్ట వ్యాక్సిన్‌ రాకపోవడంతో ప్రజలు వైరస్‌ పట్ల అప్రమత్తతో ఉంటున్నారు. ఇక కరోనా బారిన పడుతోన్న వారు కూడా ఇటీవల త్వరగానే కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు కరోనాను ఎలా జయించారో ఇతరులతో పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా తాము కరోనాను ఎలా ఎదుర్కొన్నామో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కరోనాతో తన స్వానుభవాన్ని పంచుకుంది.

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం రకుల్‌ హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే త్వరగానే కోలుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం ముంబైకి వెళ్లింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్‌ కరోనాతో తన సొంత ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఓ రోజు బాగా అలసటగా అనిపించింది. అయితే సెట్‌లో ప్రతి మూడు రోజులకోసారి కరోనా పరీక్షలు చేస్తుండడంతో నాకు కరోనా సోకి ఉంటుందన్న ఆలోచనే రాలేదు. కానీ ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకున్నాను. పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే చిత్రి యూనిట్‌కు సమాచారాన్ని తెలిపి క్యారంటైన్‌లోకి వెళ్లిపోయాను. కరోనా సోకిందన్న భయం రాకుండా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.

ట్రీమ్‌మెంట్‌లో భాగంగా మెడిసిన్స్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోలేదు.. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నాను. కరోనా కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు.. నా రోజువారీ లైఫ్ స్టైల్‌తోనే కరోనా నుంచి త్వరగా కోలుకున్నాననిపిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్‌. విన్నారుగా రకుల్‌ కరోనాను ఎంత సింపుల్‌గా జయించిందో.. మీరు కూడా ఎలాంటి భయాలకు పోకుండా ఆరోగ్యకరమై జీవిన విధానాన్ని అవలంభిస్తూ మంచి ఆహారాన్ని తీసుకోండి.. కరోనాకు చెక్‌ పెట్టండి.

Also Read: అభిమానులను సర్‏ఫ్రైజ్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. న్యూఇయర్ కానుకగా ‘ఖిలాడీ’ పోస్టర్ రిలీజ్..