Rakul Insta Post: రకుల్ కొత్తేడాది తీర్మానం ఏంటో తెలుసా..? ‘గతాన్ని మార్చలేం కాబట్టి’..
Rakul New Year Resolutions: కొత్తేడాదిని అందరూ ఎన్నో కొత్త ఆశలతో ప్రారంభించారు. గతేడాదిలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ ఏడాదిలో మంతా మంచే జరగాలని న్యూఇయర్‌లోకి..
Rakul New Year Resolutions: కొత్తేడాదిని అందరూ ఎన్నో కొత్త ఆశలతో ప్రారంభించారు. గతేడాదిలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ ఏడాదిలో మంతా మంచే జరగాలని న్యూఇయర్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే చాలా మంది కొత్తేడాదిలో ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కొన్ని కొత్తేడాది తీర్మానాలు (న్యూఇయర్ రిజల్యూషన్) చేసుకుంటారు. వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ఓ తీర్మానాన్నే చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను చేసిన తీర్మానాన్ని అభిమానులతో పంచుకుందీ ముద్దుగుమ్మ. బ్లాక్ కలర్ ట్రెండీ డ్రస్‌లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన రకుల్.. ‘వెనక్కి వెళ్లి మీరు మొదలు పెట్టిన దాన్ని మార్చలేరు. కానీ ఇప్పుడు ప్రారంభించే పని ముగింపు మాత్రం కచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది’ అంటూ కొత్తగా తీసుకునే నిర్ణయాలపై జాగ్రత్తగా ఉండండి అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్‌తో పాటు ‘న్యూ ఇయర్ రిజల్యూషన్’ అనే యాష్ ట్యాగ్ కూడా జోడించిందీ బ్యూటీ.
View this post on Instagram
ఇక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలోనే రకుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే కొద్ది సమయంలోనే కరోనాను జయించిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే రకుల్ ఈ ఏడాదిలో వరుస సినిమాలతో బిజీగా మారనుంది. ప్రస్తుతం రకుల్ చేతులో మొత్తం ఏడు సినిమాలున్నాయి.