చైనాపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ఓ ‘ప్రకటన’వంటిది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళ వారం ఆయన లోక్ సభలో చేసిన ప్రకటనపట్ల కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. లడాఖ్ లో వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం వివరించాలంటూ ప్ల కార్డులతో సభలో ప్రదర్శనకు దిగారు. చర్చకు ఎలాగూ అనుమతించడంలేదని, క్వశ్చన్ అవర్ కూడా రద్దు చేశారని వారు దుయ్యబట్టారు. బుధవారం కూడా స భలో పలువురు సభ్యులు దీనిపై పట్టు పట్టడంతో ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇవ్వాలని రాజ్ నాథ్ సింగ్ నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రకటన వంటిది చేయవచ్ఛు. నిన్న లోక్ సభలో తాను ప్రస్తావించని అంశాలను ఆయన ఈ క్లారిఫికేషన్ లో వివరిస్తారని భావిస్తున్నారు. సరిహద్దుల్లో చైనా ఇంతగా కవ్విస్తున్నప్పటికీ కేంద్రం మౌనంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. .