హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకుని ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయిన రజనీకాంత్, రేపటి నుంచి పార్టీ మీట్స్

సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పని ముగించుకుని చెన్నై కి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ప్రత్యేక..

  • Venkata Narayana
  • Publish Date - 5:52 pm, Sun, 13 December 20
హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకుని ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయిన రజనీకాంత్, రేపటి నుంచి పార్టీ మీట్స్

సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పని ముగించుకుని చెన్నై కి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రజనీ చెన్నైకి వెళ్లారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన నటిస్తోన్న తాజా మూవీ ‘అన్నాథా’ షూటింగ్ లో పాల్గొన్నారు తలైవా. పొలిటికల్ పార్టీ ఏర్పాటులో తలమునకలై ఉన్న రజనీ.. రేపటి నుంచి పార్టీ ఏర్పాటు వ్యవహారాలపై ముఖ్యులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. కాగా, పార్టీ ప్రకటన చేసింది మొదలు రజనీ ఫ్యాన్స్ తమిళనాడులో రోజూ ఏదో చోట సందడి షురూ చేస్తున్నారు. నిన్న రజనీ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన తమిళతంబీలు, రాజకీయాల్లో కొత్త శకం రాబోతోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.