ఉత్తర భారతం మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. రాజస్తాన్ రాష్ట్రంలోని బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు చెప్పారు. గురువారం తెల్లవారుజామున 4.10 గంటలకు భూకంపం 30 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈ భూకంపంతో నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. యితే, ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని సమాచారం.