ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. అహ్మదాబాద్ (గుజరాత్) మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి.. అక్కడ నిర్వాహకులతోను, సిబ్బందితోను కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇదే సమయమనుకుని వారు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇటీవల అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అజయ్ పటేల్ రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. నోట్ల రద్దు సమయంలో అహ్మదాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు 745 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ తో బాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆ మధ్య ఆరోపించారు. దాంతో వీరిపై అజయ్ పటేల్ అహ్మదాబాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.