మోదీ‌ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

|

May 05, 2019 | 1:42 PM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ‘నెంబర్ వన్ అవినీతిపరుడు’గా తన జీవితాన్ని ముగించారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయంగా చర్చ జరుగుతుండగా.. రాహుల్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “మోదీ జీ… యుద్ధం ముగిసింది. మీ ఖర్మ ఫలితం ఎదురుచూస్తోంది. మీలో ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. నా తండ్రిపై చేసే […]

మోదీ‌ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్
Follow us on

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ‘నెంబర్ వన్ అవినీతిపరుడు’గా తన జీవితాన్ని ముగించారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయంగా చర్చ జరుగుతుండగా.. రాహుల్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “మోదీ జీ… యుద్ధం ముగిసింది. మీ ఖర్మ ఫలితం ఎదురుచూస్తోంది. మీలో ఉన్న నమ్మకం చెదిరిపోతుంది. నా తండ్రిపై చేసే విమర్శలు మిమ్మల్ని కాపాడలేవు. మీపై ప్రేమతో ఓ కౌగిలింత… రాహుల్” అని ట్వీట్ చేశారు.

మరోవైపు మోదీ వ్యాఖ్యలపై మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం స్పందిస్తూ.. ” మోదీకి రాజీవ్ గాంధీ గురించి ఏమి తెలుసని మాట్లాడుతున్నారు. రాజీవ్‌పై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమేనని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి మోదీ తెలుసుకోవాలని అన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో లంచం తీసుకున్నట్టు రాజీవ్‌పై ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రజా జీవితంలో ఉండి మరణించిన రాజీవ్ గాంధీని విమర్శించడం ద్వారా మోదీ తన అన్ని అవధులనూ దాటేశారని చిదంబరం మండిపడ్డారు. అటు మోదీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక, బీజేపీకి ప్రజలే బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.