రాజకీయాలంటే ఇష్టమంటున్న రాశీఖన్నా.. ఫ్యూచర్‌లో పొలిటికల్ ఎంట్రీ

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో బాగా బిజీగా ఉన్న ఈ ముప్పై ఏళ్ల ముద్దుగుమ్మకు భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉందట. తనకు చిన్నప్పుడు ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలని ఉండేదట.

రాజకీయాలంటే ఇష్టమంటున్న రాశీఖన్నా.. ఫ్యూచర్‌లో పొలిటికల్ ఎంట్రీ

Updated on: Dec 08, 2020 | 7:50 AM

Raashi Khanna in politics: ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా నటించింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో బాగా బిజీగా ఉన్న ఈ ముప్పై ఏళ్ల ముద్దుగుమ్మకు భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన ఉందట. తనకు చిన్నప్పుడు ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలని ఉండేదట. అయితే అనుకోకుండా యాక్ట్రెస్ అయ్యిందట. నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను చాలా విషయాలు తెలుసుకున్నాను అంటోంది రాశీ.

ఇప్పుడు ఎలాగో తాను ఐఏఎస్‌ ఆఫీసర్‌ ను కాలేనని కానీ ఫ్యూచర్ లో మాత్రం పక్కా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటోంది ఈ బొద్దుగుమ్మ. అంతేకాదు కుదురితే ఒక ఎన్జీవో కూడా ప్రారంభిస్తానంటోంది. ప్రజల సమస్యలు తెలుసుకుని వారిని అండగా ఉండడం తనకు ఇష్టమంటోంది. పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను కానీ పాలిటిక్స్ చేయడం తనకు రాదని.. ప్రజాసేవే తనకు తెలుసని చెబుతోంది రాశీఖన్నా. చూద్దాం మరి ఈ భామ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతుందో. ఇక దుల్క‌ర్ స‌ల్మాన్, హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రంలో రెండో క‌థానాయిక‌గా ర‌ష్మిక న‌టించ‌బోతోంద‌ని మొదట ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్లేస్ లో రాశీఖ‌న్నా నటిస్తున్నట్లు సమాచారం.