Viral News: ప్రొఫెసర్ నిర్వాకం.. సినిమా కథ ఆధారంగా ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రం.. అవాక్కైన విద్యార్థులు

|

Feb 05, 2022 | 1:42 PM

పరీక్షలు(exams) నిర్వహించడం అధికారులు, ఉపాధ్యాయులకు కత్తిమీద సాము లాంటింది. ఎగ్జామ్ నిర్వహణలో ఏమైనా తప్పులు దొర్లితే అవి విద్యార్థుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ఎంతో జాగ్రత్తగా బ్లూ ప్రింట్(blue print) ఆధారంగా అధికారులు ప్రశ్నా పత్రాన్ని తయారు చేస్తారు.

Viral News: ప్రొఫెసర్ నిర్వాకం.. సినిమా కథ ఆధారంగా ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రం.. అవాక్కైన విద్యార్థులు
Student Exam
Follow us on

పరీక్షలు(exams) నిర్వహించడం అధికారులు, ఉపాధ్యాయులకు కత్తిమీద సాము లాంటింది. ఎగ్జామ్ నిర్వహణలో ఏమైనా తప్పులు దొర్లితే అవి విద్యార్థుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ఎంతో జాగ్రత్తగా బ్లూ ప్రింట్ ఆధారంగా అధికారులు ప్రశ్నా పత్రాన్ని తయారు చేస్తారు. కానీ కేరళలో జరిగిన ఓ పరీక్ష మాత్రం విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. సిలబస్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ను తయారు చేయలేదేమో అనుకుంటున్నారా..? అది కాదు. పరీక్ష ప్రశ్నా పత్రంలో ఓ సూపర్ హిట్ సినిమాను ఆధారంగా చేసుకుని తయారు చేశారు. ఏంటీ నమ్మకం కలగట్లేదా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.. కేరళలో(Kerala)ని మార్ అథనాసియస్ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులకు మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. మెకానికల్‌ ఆఫ్‌ ఫ్లుయిడ్స్‌(Mechanical of Fluids) అనే సబ్జెక్ట్‌లో 50 మార్కుల ప్రశ్నాపత్రమంతా మలయాళంలో ఘన విజయం సాధించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘మిన్నల్‌ మురళి’(Minnal Murali) కథను ఆధారంగా చేసుకొని ఇచ్చారు. అది చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. అంతే కాకుండా చివర్లో ఉన్న ముగింపును చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ప్రశ్నాపత్రమంతా కల్పితం. నన్ను విమర్శించాలనుకుంటే తర్వాత విమర్శించండి. ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జామ్‌ని ఎంజాయ్ చేయండి’’ అని రాసుంది. ఈ ఫొటోలు నెట్టింట్‌ వైరల్‌ అయ్యాయి. ఈ ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన ప్రొఫెసర్ పై  నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ మధ్యప్రదేశ్‌లోని ఖండవాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్షలో భాగంగా ఆరో తరగతి విద్యార్థుల ప్రశ్నాపత్రంలో సినీ నటులు కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ తనయుడి పూర్తి పేరేమిటి? అంటూ అడిగారు. ఇదికాస్త వివాదాస్పదం అవ్వడంతో అక్కడి జిల్లా విద్యాధికారి సంబంధిత పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

Also Read

Pakistan Income Tax Rules: ఆదాయపు పన్ను అనేది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది.

IND vs WI: కోహ్లీ, రోహిత్ జోడీ ఖజానాలో మరో స్పెషర్ రికార్డు.. అదేంటంటే?

SSC Status Report 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల ఫలితాల తేదీలు విడుదల.. సీజీఎస్‌ఎల్, సీజీఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే!