రైతుల ఆందోళనకు పెరుగుతున్న మద్దతు.. ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు వెనక్కి ఇచ్చిన మాజీ సీఎం..

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రైతుల ఆందోళనకు పెరుగుతున్న మద్దతు.. ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు వెనక్కి ఇచ్చిన మాజీ సీఎం..

Edited By:

Updated on: Dec 03, 2020 | 2:51 PM

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతుల ఆగ్రహంతో నేతలు సైతం దిగివస్తున్నారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న పంజాబ్ రైతులకు మద్దతుగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అకాళీద‌ళ్ నేత‌ ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా త‌న అసహానాన్ని వ్య‌క్తం చేశారు. రైతుల‌కు అండగా ఆయ‌న త‌న వ‌ద్ద ఉన్న ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును కేంద్ర ప్ర‌భుత్వానికి తిరిగి ఇవ్వ‌నున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌ను మోసం చేస్తున్న‌ద‌ని, అందుకు నిర‌స‌న‌గా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును వాప‌స్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.