దమ్ముందా ఇమ్రాన్ ఖాన్?: పంజాబ్ సీఎం

| Edited By:

Oct 18, 2020 | 6:56 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను దమ్ముంటే మాట మీద నిలబడాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. తమపై అనవసరంగా నిందలు వేయొద్దని, ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు నాదీ హామీ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసందే. దీంతో దీనిపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ మాట మీద నిలబడాలని సవాల్ చేశారు. ఆధారాలు ఇంకేం కావాలి, దాడి చేసిందే తామేనని జైషే మహ్మద్ ఉగ్ర […]

దమ్ముందా ఇమ్రాన్ ఖాన్?: పంజాబ్ సీఎం
Follow us on

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను దమ్ముంటే మాట మీద నిలబడాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. తమపై అనవసరంగా నిందలు వేయొద్దని, ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు నాదీ హామీ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసందే. దీంతో దీనిపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ మాట మీద నిలబడాలని సవాల్ చేశారు.

ఆధారాలు ఇంకేం కావాలి, దాడి చేసిందే తామేనని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించింది కదా, దాని బాస్ పాక్‌లోనే ఉన్నాడుగా అని అన్నారు. ముందు అతన్ని పట్టుకోవాలని, లేదంటే భారతే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భారత ఆర్మీ మట్టుపెట్టిన ఉగ్రవాదులను చూసైనా పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని, తమ జవాను ఒకరు చనిపోతే అందుకు బదులుగా మీ జవాన్లను ఇద్దరిని హతమారుస్తామని అమరీందర్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు.