కడప జిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి

|

Aug 29, 2020 | 9:13 AM

కడప జిల్లా పులివెందులలో అక్రమ మద్యం రవాణాకు అడ్డుకునేందుకు ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించారు.

కడప జిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి
Follow us on

కడప జిల్లా పులివెందులలో అక్రమ మద్యం రవాణాకు అడ్డుకునేందుకు ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించారు. పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో ఓ కారులో మద్యం తరలిస్తున్నారని ఎస్సై గుర్తించారు. సిబ్బంది స‌హాయంతో ఆ కారును చుట్టుముట్టారు. దీంతో లోప‌ల ఉన్న కేటుగాడు కారును ముందుకు, వెన‌క్కు క‌దుపుతూ పోలీసుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌రిగా వాహ‌నం పోలీసుల‌పైకి దూసుకెళ్ల‌గా, ఎస్సై గోపీనాథ్ రెడ్డి చాకచక్యంగా కారుపై దూకి సినిమా ఫక్కీలో రెండు కిలోమీటర్ల కారు ముందు భాగంలో పడుకొని వారిని అదుపు చేసి కారు వేగాన్ని తగ్గించారు. ఈ క్ర‌మంలో ఇత‌ర పోలీసులు వ‌చ్చి వాహ‌నాన్ని అడ్డుకున్నారు. నిందితుడు ఎస్కేప్ అవ్వ‌గా, కారు నుంచి 80 మద్యం బాటిళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. కారులో నుంచి పారిపోయిన వ్యక్తి సింహాద్రిపురం మండలం రావుల కొలను గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. అత‌డు గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈమధ్య కాలంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న‌ట్లు తెలిపారు. నిందితుడిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని సీఐ భాస్క‌ర్ రెడ్డి తెలిపారు.

Also Read :

ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్​గా సీఎం జగన్​

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

ఖేల్​రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు క‌రోనా పాజిటివ్