నేపాల్‌లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం

|

Apr 12, 2019 | 6:38 PM

నేపాల్: పబ్‌జీ గేమ్ వల్ల యువతపై చెడు ప్రభావం పడుతోందని.. ఈ గేమ్‌ను భారత్ లో వెంటనే నిషేదించాలని ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఈ గేమ్ పై నిషేధం విధించింది. నేపాల్ దేశం కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. పబ్‌జీ గేమ్‌ని నేపాల్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ఈ గేమ్‌పై ఆ దేశంలో నిన్న‌టి నుంచి నిషేధం అమ‌లులోకి తీసుకువచ్చింది. పిల్ల‌ల‌పై ఈ గేమ్ చెడు ప్ర‌భావాన్ని […]

నేపాల్‌లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం
Follow us on

నేపాల్: పబ్‌జీ గేమ్ వల్ల యువతపై చెడు ప్రభావం పడుతోందని.. ఈ గేమ్‌ను భారత్ లో వెంటనే నిషేదించాలని ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఈ గేమ్ పై నిషేధం విధించింది. నేపాల్ దేశం కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. పబ్‌జీ గేమ్‌ని నేపాల్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ఈ గేమ్‌పై ఆ దేశంలో నిన్న‌టి నుంచి నిషేధం అమ‌లులోకి తీసుకువచ్చింది. పిల్ల‌ల‌పై ఈ గేమ్ చెడు ప్ర‌భావాన్ని చూపిస్తున్నందునే ఈ గేమ్‌ను నిషేధించామ‌ని నేపాల్ టెలిక‌మ్యూనికేష‌న్స్ అథారిటీ (ఎన్‌టీఏ) డిప్యూటీ డైరెక్ట‌ర్ సందీప్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ గేమ్ వల్ల ఎలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగనప్పటికీ.. తమ పిల్లల చదువులకు ఈ గేమ్ వల్ల ఆటంకం కలిగుతోందని తల్లిదండ్రులు భావిస్తుండడం వల్ల ఈ పబ్‌జీ గేమ్‌ను నిషేదిస్తున్నామని ఆయన తెలిపారు.