కే9 బ్యూటీ స్పా ముసుగులో వ్యభిచారం

|

Sep 06, 2020 | 9:17 PM

కే9 (K9) బ్యూటీ స్పా....బయటి నుంచి చూసేవారికి ఇదో మసాజ్‌ సెంటర్‌. కానీ లోపలికి వెళ్లి చూస్తే...ఇదో రెడ్‌లైట్‌ బిల్డింగ్‌. స్పా ముసుగులో గుట్టుగా హైటెక్‌ వ్యభిచారం జరుగుతోంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల నివాసం ఉండేవారికి కూడా తెలియదు...

కే9 బ్యూటీ స్పా ముసుగులో వ్యభిచారం
prostitution racket in hyderabad
Follow us on

కే9 (K9) బ్యూటీ స్పా….బయటి నుంచి చూసేవారికి ఇదో మసాజ్‌ సెంటర్‌. కానీ లోపలికి వెళ్లి చూస్తే…ఇదో రెడ్‌లైట్‌ బిల్డింగ్‌. స్పా ముసుగులో గుట్టుగా హైటెక్‌ వ్యభిచారం జరుగుతోంది. ఈ విషయం ఆ చుట్టుపక్కల నివాసం ఉండేవారికి కూడా తెలియదు. అక్కడికి ఎవరెవ్వరూ వచ్చి వెళ్తున్నారో కూడా తెలియదు. అంతేకాదు అదో ఇంద్రభవనంలా కనిపిస్తుండటంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. కానీ స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారాన్ని టీవీ9 బృందం బయటపెట్టింది.

విజయవాడలో K9 బ్యూటీ స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందని టీవీ9కి సమాచారం అందింది. అంతే టీవీ9, టాస్క్‌ఫోర్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌గా K9 బ్యూటీ స్పాపై దాడి చేశారు. మిజోరాం, సిక్కిం, ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన యువతులు ఏడుగురు యువతులు పట్టుబడ్డారు. వారితోపాటు ఇద్దరు విటులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కే9 బ్యూటీ స్పా పేరుతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలు స్వీటీ అలియాస్‌ నందిని, కిరణ్‌లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హంగు ఆర్భాటంతో లక్షల్లో ప్యాకేజీ వసూళ్లు చేస్తూ విటులను ఆకర్షిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇలాంటి దందాలు నడుపుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.