మోదీ నిర్ణయంతో షాక్.. రైల్వేలు ఇక ప్రైవేటుకు.. !

| Edited By:

Sep 26, 2019 | 10:38 AM

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రధాన రూట్లలోని రైళ్లని ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూట్లను ఎంపిక చేసి.. సాధ్యాసాధ్యాలపై వివరణ కోరుతూ ఆయా జోన్లకు లేఖలు కూడా రాసినట్లు సమాచారం. ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలైన సుదూర, ఓవర్‌నైట్‌, ఇంటర్‌సిటీ, సబర్బన్‌ విభాగాలను ఎంపిక చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 27న […]

మోదీ నిర్ణయంతో షాక్.. రైల్వేలు ఇక ప్రైవేటుకు.. !
Follow us on

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రధాన రూట్లలోని రైళ్లని ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూట్లను ఎంపిక చేసి.. సాధ్యాసాధ్యాలపై వివరణ కోరుతూ ఆయా జోన్లకు లేఖలు కూడా రాసినట్లు సమాచారం. ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలైన సుదూర, ఓవర్‌నైట్‌, ఇంటర్‌సిటీ, సబర్బన్‌ విభాగాలను ఎంపిక చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 27న కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆయా జోన్లు తమ అభిప్రాయాలను రైల్వే బోర్డుకు తెలుపనున్నాయి.

వీటితో పాటు సుదూర, ఓవర్‌నైట్‌ రూట్లలో సికింద్రాబాద్‌-దిల్లీ, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, దిల్లీ-ముంబయి, దిల్లీ-లఖ్‌నవూ, దిల్లీ-జమ్మూ/కత్రా, దిల్లీ-హావ్‌డా, దిల్లీ-చెన్నై, ముంబయి-చెన్నై, హావ్‌డా-చెన్నై, హావ్‌డా-ముంబయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటర్‌సిటీ రూట్లలో సికింద్రాబాద్‌-విజయవాడ, ముంబయి-అహ్మదాబాద్‌, ముంబయి-పుణె, ముంబయి-ఔరంగాబాద్‌, దిల్లీ-చండీగఢ్‌, దిల్లీ-జైపుర్‌/అజ్మేర్‌, హావ్‌డా-పూరీ, హావ్‌డా-టాటా, హావ్‌డా-పట్నా, చెన్నై-బెంగళూరు, చెన్నై-కోయంబత్తూరు, చెన్నై-మధురై, ఎర్నాకుళం-త్రివేండ్రం ఉన్నాయి. అలాగే సబర్బన్‌ విభాగంలో ముంబయి, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌ రూట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.