PM Modi : వారణాసిలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష, ఉన్నతాధికారులు, స్థానిక పరిపాలన, వైద్యులతో కీలక మీటింగ్

|

Apr 18, 2021 | 10:38 AM

Modi Review meeting on Varanasi Covid-19 Situation : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు..

PM Modi :  వారణాసిలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష, ఉన్నతాధికారులు, స్థానిక పరిపాలన, వైద్యులతో కీలక మీటింగ్
PM Narendra Modi
Follow us on

Modi Review meeting on Varanasi Covid-19 Situation : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా వారణాసిలో కోవిడ్ పరిస్థితిపై సమీక్షించాలని ప్రధాని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఉదయం 11 గంటలకు వారణాసిలో COVID-19 పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వారణాసిలో కోవిడ్ పై పోరులో ముందున్న ఉన్నతాధికారులు, స్థానిక పరిపాలన, వైద్య సిబ్బందితో ప్రధాని సమీక్ష చేస్తారు. మరోవైపు, భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో గత 24 గంటల్లో 2,60,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ రాష్ట్రాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీగా పెంచాలన్న మోదీ.. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత లేకుండా చూడాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌కు ప్రత్యామ్నాయం లేదని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తున్నారు.

Read also : Self Lockdown : ఏపీలో దడపుట్టిస్తోన్న కరోనా, పట్టణాలు.. గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తోన్న జనం