బ్రేకింగ్.. రేపిస్టులకు క్షమాభిక్ష అవసరంలేదు.. రాష్ట్రపతి కోవింద్

నిర్భయ కేసులో రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి క్షమాబిక్ష పిటిషన్లను తిరస్కరించారు. 2012 లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచార కేసులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా. ఈ దోషి మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్ఛుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇందుకు సంబంధించిన ఫైలును కేంద్ర హోం శాఖకు పంపారు. ‘ పోక్సో […]

బ్రేకింగ్.. రేపిస్టులకు క్షమాభిక్ష అవసరంలేదు.. రాష్ట్రపతి కోవింద్

Updated on: Dec 06, 2019 | 8:13 PM

నిర్భయ కేసులో రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి క్షమాబిక్ష పిటిషన్లను తిరస్కరించారు. 2012 లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచార కేసులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా. ఈ దోషి మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్ఛుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇందుకు సంబంధించిన ఫైలును కేంద్ర హోం శాఖకు పంపారు. ‘ పోక్సో ‘ చట్టం కింద దోషులుగా తేలినవారు క్షమాభిక్షకు అర్హులు కారని, పార్లమెంటు ఈ విధమైన పిటిషన్లను సమీక్షించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో దిశ కేసు నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన రోజే రాష్ట్రపతి.. నిర్భయ కేసు దోషులైన క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించడం విశేషం..మైనర్లపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us