భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో రాష్ట్రపతి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు, బిమ్‌స్టెక్ దేశాధినేతల నడుమ ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. భారతదేశానికి సేవ చేసే భాగ్యం తనకు మరోసారి దక్కటం ఎంతో గౌరవప్రదంగా ఉందని ఈ కార్యక్రమానికి కొద్దిసేపటి ముందు మోదీ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.
#WATCH: Narendra Modi takes oath as the Prime Minister of India for a second term. pic.twitter.com/P5034ctPyu
— ANI (@ANI) May 30, 2019