పనస తినాలని ఉందన్న ప్రణబ్ ముఖర్జీ…

వైద్యులు అందిస్తున్న చికిత్సకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతతో ఆర్మీ ఆసుపత్రిలో చేరడానికి ఓ వారం రోజుల ముందు జరిగిన..

పనస తినాలని ఉందన్న ప్రణబ్ ముఖర్జీ...
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2020 | 5:12 PM

Pranab Mukherjee Asked for Jackfruit : వైద్యులు అందిస్తున్న చికిత్సకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతతో ఆర్మీ ఆసుపత్రిలో చేరడానికి ఓ వారం రోజుల ముందు జరిగిన సంఘటనను ప్రణబ్  కుమారుడు అభిజిత్‌ గుర్తు చేసుకున్నారు. తనకు ఫోన్ చేసి పనసపండు తినాలని ఉందని, తెచ్చిపెట్టమని కోరినట్లుగా అభిజిత్ మీడియాకు తెలిపారు.

దీంతో వెంటనే తాను  బిర్హూం జిల్లాలోని మా స్వగ్రామమమైన మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును కోయించి దానిని ఆగస్టు 3న రైలులో ఢిల్లీకి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. తను తీసుకెళ్లిన పనస తొనలు తిన్నారని, అప్పుడు ఆయన షుగర్ లెవెల్స్ కూడా ఏమాత్రం పెరగలేదని, పైగా చాలా హ్యాపీగా కూడా ఉన్నారని చెప్పారు.

అయితే… ఆ తర్వాత వారం రోజులకు ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా జబ్బుపడ్డారని అన్నారు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేశారు. దానికి ముందు ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని అన్నారు.  రక్షణ మంత్రిగా ప్రణబ్ సేవలందించారని, ఆయన మెడికల్ రికార్డులన్నీ ఆర్మీ వైద్యుల దగ్గర ఉండటంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ ఆసుపత్రిని సంప్రదించామని చెప్పారు. చివరిసారిగా చూసినప్పుడు ఆయన శ్వాస కూడా నిలకడగా ఉండటం గమనించానని అభిజిత్ చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని అన్నారు.